Kaizer News

కొడంగల్‌ అంతటా సీఎం సోదరుల కబ్జాలే

కొడంగల్‌ అంతటా సీఎం సోదరుల కబ్జాలే

· State - Telangana · ntnews.com

ప్రశ్నిస్తారన్న భయంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ హకీంపేట ఎడ్యుకేషన్‌ హబ్‌లో వందల కోట్ల దోపిడీ మాజీ ఎమ్మెల్యే పట్నం ఫైర్‌ కోస్గి, సెప్టెంబర్‌ 18 : కొడంగల్‌ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సీఎం రేవంత్‌ సోదరుల భూ కబ్జాలే కనిపిస్తాయని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవా రం ఆయన నారాయణపేట జిల్లా కోస్గిలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ మూడేండ్ల పాలనలో రాష్ట్రం దివాలా స్థితికి చేరిందని విమర్శించా రు. 420 హామీలు ఇచ్చి వాటిని అ మలు చేయడం చేతకాక డైవర్షన్‌ పాలసీలో భాగంగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ఆగడాలను ప్రశ్నిస్తారన్న భయం తో అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారని దుయ్యబట్టారు. ఎక్కడ చూసినా సీఎం కుటుంబీకుల కబ్జాలే కనిపిస్తాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వం రాగానే రేవంత్‌ కుటుంబసభ్యులు చేసిన అక్రమాలకు జైలు జీవితం గడుపాల్సి ఉంటుందని హెచ్చరించారు. రేవంత్‌ కుటుంబంతోపాటు అవినీతికి పాల్పడ్డ మంత్రు లు సైతం జైలుకెళ్లాల్సిందేనని స్పష్టంచేశారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్ల పనులు చేయి స్తూ అభివృద్ధి చేస్తున్నామంటూ ప్రజలను మభ్యపెడుతూ.. సీఎం సోదరులు 20% కమీషన్‌ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 1.3 లక్షల ఎకరాల భూమిని 22ఏ జాబితాలో పెట్టి 30% కమీషన్‌ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇక హకీంపేటలో ఎడ్యుకేషన్‌ హబ్‌ పేరుతో సీఎం సోదరులతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా బినామీల పేరుతో వందల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు

Original source: ntnews.com
Read more on Kaizer News