Kaizer News

పెగూలా శుభారంభం

పెగూలా శుభారంభం

· Sports · sakshi.com

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళలసింగిల్స్‌ విభాగంలో 2024 రన్నరప్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ జెస్సికా పెగూలా (అమెరికా) శుభారంభం చేసింది. ఎలీనా గాబ్రియేలా రూసె (రొమేనియా)తో ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో పెగూలా 6–3, 6–2తో గెలిచింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పెగూలా నాలుగు ఏస్‌లు సంధించింది. 26 విన్నర్స్‌ కొట్టిన పెగూలా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. మరోవైపు ప్రపంచ 29వ ర్యాంకర్, రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. క్రెజికోవా 6–7 (4/7), 2–6తో కమీలా రఖిమోవా (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయింది. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News