Kaizer News

Car Overturn | డివైడర్‌ను ఢీకొట్టి కారు పల్టీలు..

Car Overturn | డివైడర్‌ను ఢీకొట్టి కారు పల్టీలు.. ఫ్యామిలీని రక్షించిన ఎయిర్‌ బ్యాగ్స్‌

· State - Telangana · ntnews.com

Car Overturn | సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 19 : సిద్దిపేట నుండి గజ్వేల్ వెళుతున్న కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. అయితే వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. దంపతులిద్దరూ సిద్దిపేటలో పరీక్ష రాసిన తమ కూతురును కారులో గజ్వేల్‌కు తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును తండ్రి డ్రైవ్ చేస్తుండగా.. అతని భార్య పక్క సీట్లో కూర్చోగా, కూతురు వెనుకసీట్లో కూర్చుంది. కారు పల్టీలు కొట్టిన సమయంలో వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే వెనుకాల కూర్చున్న కూతురు తల, ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరగిన సమయంలో అదే మార్గంలో సిరిసిల్ల వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే కారు వద్దకు వెళ్లారు. తన భద్రతా సిబ్బందితో కలిసి బాధితులని కారులోనుండి బయటకు తీశారు. బాధితులను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించి.. మెరుగైన వైద్యం అందించాలని పోలీసు అధికారులకు సూచించారు. Plank Exercise | రోజుకు 60 సెక‌న్ల పాటు ప్లాంక్ చేస్తే బీపీ త‌గ్గుతుంది.. నిపుణుల వెల్ల‌డి.. RTC Elections | ఆర్టీసీలో ఎన్నికల నగారా.. 9న గుర్తింపు సంఘం ఎన్నికలు! iPhone 18 Pro | బంగారం అమ్మి భార్యకు ఐఫోన్‌ 18ప్రో.. భారత్‌లో మొదలైన 18 సిరీస్‌ అమ్మకాలు..!

Original source: ntnews.com
Read more on Kaizer News