Kaizer News

సూర్య వంశం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ?

సూర్య వంశం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

· Entertainment · tv9telugu.com

తెలుగు సినీ పరిశ్రమలో బాలనటుడిగా తన అమాయకమైన చూపులతో, క్యూట్ అభినయంతో ప్రేక్షకుల మనస్సు దోచుకున్న నటుడు ఆనంద్ వర్ధన్. విక్టరీ వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘సూర్యవంశం’లో చిన్న వెంకటేష్‌ కొడుకుగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర పోషించారు. ఆనంద్ వర్ధన్ ప్రముఖ గాయకుడు దివంగత పి.బి. శ్రీనివాస్ మనవడు. కేవలం 4 సంవత్సరాల వయసులోనే గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’ సినిమాలో వాల్మీకి, బాల హనుమంతుని పాత్రలతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ప్రియరాగాలు’ సినిమాలో సౌందర్య, జగపతి బాబులతో కలిసి నటించి ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘సూర్యవంశం’ సినిమాలో తాత, తండ్రుల మధ్య నలిగిపోయే మనవడి పాత్రలో ఆనంద్ వర్ధన్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా రీమేక్ అయిన ‘సూర్యవంశం’ హిందీ వర్షన్‌లో కూడా అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘ప్రేమించుకుందాం రా’, ‘మనసంతా నువ్వే’, ‘ఇంద్ర’, ‘నేనున్నానూ’ వంటి దాదాపు 25కి పైగా సూపర్ హిట్ సినిమాల్లో ప్రముఖ స్టార్ హీరోలతో కలిసి బాలనటుడిగా మెప్పించారు. బాలనటుడిగా మంచి క్రేజ్ ఉన్నప్పటికీ చదువుపై దృష్టి పెట్టేందుకు ఆనంద్ కొన్నాళ్ల పాటు సినిమాలకు విరామం ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) పూర్తి చేసిన ఆయన, నటనపై ఉన్న మక్కువతో మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘నిదురించు జహాపన’ అనే చిత్రంతో హీరోగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఒకప్పుడు అమాయకమైన చిన్నారిగా కనిపించిన ఆనంద్ వర్ధన్, ఇప్పుడు హ్యాండ్‌సమ్ లుక్‌లో పూర్తి మేకోవర్ అయ్యి హీరో కటౌట్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు.. ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే

Original source: tv9telugu.com
Read more on Kaizer News