Kaizer News

'బ్యూటీ ఫుల్‌' బిజినెస్

'బ్యూటీ ఫుల్‌' బిజినెస్

· State - Telangana · sakshi.com

మారుతున్న జీవనశైలి, స్వీయ రక్షణపై యువతలో వస్తున్న మార్పే కారణం ఈ రంగానికి ఉన్న డిమాండ్‌తో యువత కూడా దీనిపై దృష్టి 2033 నాటికి దేశంలో ఈ వ్యాపారం రూ.2,01,185 కోట్లకు చేరుతుందని అంచనా ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌ నివేదికలో వెల్లడి విశాఖపట్నంలోని ఎండాడకు చెందిన శ్రీహరి వయసు 29 ఏళ్లు. బీటెక్‌ చదివా­డు. అలాగే, అప్పలరాజు వయసు 32. ఎంబీఏ చదివాడు. వీరిద్దరూ మార్కెట్లో డిమాండ్‌ ఉన్న సెలూన్‌ రంగాన్ని గుర్తించి సుమారు 850 చదరపు అడుగుల స్థలంలో మొదట హెయిర్‌ కట్, బియర్డ్‌ గ్రూమింగ్, ఫేషియల్, హెయిర్‌ స్పా సేవలు ప్రారంభించారు. కస్టమర్ల అభిరుచి తెలుసుకున్న తర్వాత వీరు హెయిర్‌ కలర్, హెయిర్‌ ట్రీట్‌మెంట్స్, వెడ్డింగ్‌ గ్రూమింగ్‌ ప్యాకేజీలను జోడించారు. ఇక ప్రచారం కోసం పెద్ద మొత్తంలో ఖర్చుచేయకుండా సోషల్‌ మీడియాను ఉపయోగించారు. కొత్త హెయిర్‌స్టైల్స్, మేకోవర్‌ వీడియోలను స్థానికంగా ప్రచారం చేయడంతో క్రమంగా రిపీట్‌ కస్టమర్లు పెరిగారు. సేవల సంఖ్య కంటే కస్టమర్‌ మళ్లీ రావడమే వ్యాపారానికి బలంగా మార్చుకున్నారు. బెజవాడకు చెందిన వంశీది తొలుత సాదాసీదా బార్బర్‌ షాపు. యువత అవసరాలను గుర్తించి మార్కెట్‌ డిమాండ్‌కు తగ్గట్లుగా తన వ్యాపారాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా మెన్స్‌ గ్రూమింగ్‌పై దృష్టిపెట్టాడు. సాధారణ హెయిర్‌ కట్‌తో ఆగకుండా బియర్డ్‌ డిజైనింగ్, హెయిర్‌ కలర్, ఫేషియల్, స్పా, పార్టీ–వెడ్డింగ్‌ గ్రూమింగ్‌ సేవలను ఒకేచోట అందుబాటులోకి తెచ్చాడు. వాట్సాప్‌ రిమైండర్లు, పండుగ ఆఫర్లు, కాంబో ప్యాకేజీలతో కస్టమర్లను రిపీట్‌ విజిట్లకు తీసుకురావడంపై దృష్టిపెట్టాడు. ‘బార్బర్‌ షాప్‌’ నుంచి ‘గ్రూమింగ్‌ స్టూడియో’గా మారడం ద్వారా పురుషుల్లో పెరుగుతున్న వ్యక్తిగత సంరక్షణ ఆసక్తిని వ్యాపార అవకాశంగా మలుచుకున్నాడు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సెలూన్‌ పరిశ్రమ మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతోందనడానికి ఈ రెండు ఉదంతాలే ఉదాహరణ. మారుతున్న కస్టమర్‌ అవసరాలకు అనుగుణంగా సెలూన్ల సేవలూ మారుతున్నాయి. ఒకప్పుడు కేవలం హెయిర్‌ కట్‌తో పాటు షేవింగ్‌కే పరిమితమైన ఈ సెలూన్ల ఓనర్లు ఇప్పుడు మార్కెట్‌ డిమాండ్లతో హెయిర్‌ స్పా, స్కిన్‌ కేర్, హెయిర్‌ కలర్, మేకప్, గ్రూమింగ్‌ ప్యాకేజీలు అందుబాటులోకి తెస్తున్నారు. మారుతున్న జీవనశైలి, స్వీయ రక్షణపై యువతలో అవగాహన పెరగడంతో ఈ వ్యాపారం ఇప్పుడొక విలాసవంతమైన సేవ నుండి నిత్యావసర సేవగా మార్పు చెందింది. మెట్రో నగరాల నుంచి పట్టణాల వరకు ఈ తరహా బ్యూటీ సేవలకు ఏటా డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో కొత్తతరం వ్యాపార రంగాల్లో బ్యూటీ, గ్రూమింగ్‌ బిజినెస్‌ ఒకటిగా మారింది. ఫలితంగా ఉద్యోగం కోసం ఎదురుచూడటం కంటే ఈ రంగం వైపు కూడా నేటి యువత దృష్టిపెడుతోంది. నగరాల్లోనే మూడో వంతు.. రాష్ట్రంలో 2025 అక్టోబరు నాటికి 7,020 బ్యూటీ సెలూన్లు ఉన్నట్లు ‘బిజినెస్‌ డేటా’ వెల్లడించింది. 2023తో పోలిస్తే ఇది 5.78 శాతం పె­రుగుదల. ముఖ్యంగా ఇందులోని 6,653 సెలూన్లు (94.77 శాతం) సింగిల్‌ ఓనర్‌ వ్యాపారాలే కావడం విశేషం. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మరో 500 వరకు సెలూన్లు ఏర్పాటైనట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని సెలూన్‌ వ్యాపారంల

Original source: sakshi.com
Read more on Kaizer News