Kaizer News

Tirumala laddu: టీటీడీ లడ్డు కల్తీ కేసులో కీలక పరి

Tirumala laddu: టీటీడీ లడ్డు కల్తీ కేసులో కీలక పరిణామం..కీలక వ్యక్తి అరెస్ట్

· State - Telangana · hmtvlive.com

Shorts Tirumala laddu: తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీలో వాడే నెయ్యి కల్తీకి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అత్యంత సంచలన చర్యలు చేపట్టింది. ఈ కుట్రలో ప్రధాన నిందితుడు, కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసిన సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అదుపులోకి తీసుకున్న ఆయన్ను, విశాఖపట్నంలోని పీఎమ్‌ఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ అరెస్ట్‌కు సంబంధించి ఈడీ విడుదల చేసిన సుదీర్ఘ ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈడీ దర్యాప్తులో వెలుగుచూసిన నిజాలు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. టీటీడీ నిబంధనల ప్రకారం శ్రీవారి లడ్డూ తయారీకి కేవలం స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. కానీ నిందితులు భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అడ్డదారులు తొక్కారు. అసలు నిజాలు దర్యాప్తులో ఇలా బయటపడ్డాయి: స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా రిఫైన్డ్ పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్‌లను వాడారు. నెయ్యికి చిక్కదనాన్ని, అచ్చం ఆవు నెయ్యి లాంటి సువాసనను తెప్పించడానికి, పైకి పూసల రూపంలో కనిపించేలా చేయడానికి రసాయనాలను వినియోగించారు. ఈ కల్తీ కోసం 'ఎంజీ 90', 'మైవాసెట్ సాఫ్ట్ 400', 'మోనోగ్లిజరైడ్స్', 'ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్' వంటి హానికరమైన రసాయనాలను జోడించారు. ఈ ప్రమాదకర మిశ్రమాలను తయారు చేసి, చివరకు అధికారులను బురిడీ కొట్టించేందుకు వాటిపై 'ఆగ్ మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి' అని నకిలీ ముద్రలు వేసి మరీ తిరుమలకు సరఫరా చేశారు. ఈ కల్తీ నెయ్యి సరఫరాల మొత్తం విలువ దాదాపు రూ. 230 కోట్లు ఉంటుందని ఈడీ గుర్తించింది. ఇందులో ఒక్క కైలాష్ చంద్ మంగ్లానే తన సొంత డైరీ ఫ్యాక్టరీలో ఏకంగా రూ. 96 కోట్ల విలువైన నకిలీ నెయ్యిని ఉత్పత్తి చేశాడని తేలింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మంగ్లా అనేక ఎత్తుగడలు వేశాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కెమికల్స్, నూనెలను సేకరించి.. శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్, మల్ గంగ మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్, ఏఆర్ డెయిరీ ఫుడ్స్ వంటి ఇతర డెయిరీ సంస్థల ద్వారా ఈ కల్తీ సరుకును తిరుమలకు రవాణా చేయించాడు. అంతేకాదు, ఈ అక్రమ లావాదేవీలను దాచడానికి నకిలీ విక్రయ, కొనుగోలు రికార్డులను సృష్టించి భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడు. ఇప్పటికే ఈ కేసులో భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రమోటర్, డైరెక్టర్ విపిన్ జైన్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కైలాష్ చంద్ మంగ్లా అరెస్ట్‌తో ఈ కేసు మరింత కీలక దశకు చేరుకుంది. కోట్లాది మంది భక్తుల అపారమైన విశ్వాసాన్ని, పవిత్రమైన హిందూ సంప్రదాయాలను కాలరాస్తూ, స్వామివారి ప్రసాదంలోనే కల్తీకి పాల్పడిన ఈ మాయగాళ్ల బాగోతంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేవుడి ప్రసాదంతో వ్యాపారం చేసి, భక్తుల ఆరోగ్యాలతో చెలగాటమాడిన దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రార

Original source: hmtvlive.com
Read more on Kaizer News