Kaizer News

Kurnool: కర్నూలులో ఇంటి దొంగతనం కేసు ఛేదన నలుగురు

Kurnool: కర్నూలులో ఇంటి దొంగతనం కేసు ఛేదన నలుగురు ముద్దాయిల అరెస్ట్!

· State - Telangana · hmtvlive.com

Kurnool: జూలై 06 తేదీ నాలుగవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆదిత్య నగర్ , ఉల్చాల రోడ్డు నందు నివాసం ఉంటున్న జయంతి మహేశ్వర్ రెడ్డి గారి ఇంట్లో తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సుమారు 25 గ్రాముల బంగారు నగలు మరియు 320 గ్రాముల వెండి ఆభరణాలు దొంగతనం చేశారు... అనుమానస్పదంగా ఒక స్కూటీ ని గుర్తించి, దాని గురించి ఆరా తీయగా 1). ఎరుకలి గంగా ప్రసాద్ తండ్రి పేరు ఎరుకలి రామాంజనేయులు వయస్సు 38,, తాడిపత్రి టౌన్ 2). ఎరుకలి శివప్రసాద్ తండ్రి పేరు ఎరుకలి రామచంద్ర వయసు 48 తాడిపత్రి టౌన్ 3). కామ్లే కార్తిక్ తండ్రి పేరు శ్రీనివాసులు వయసు 32,, ఇందిరాగాంధీ నగర్ కర్నూల్ 4).ఎరుకలి రామాంజనేయులు తండ్రి పేరు ఎరుకలి సుంకన్న వయసు 43 పామిడి,, ప్రస్తుతం గుత్తి, అనంతపురం జిల్లాగా గుర్తించారు. CI విక్రమ సింహ అధ్యక్షతన ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కాన్స్టేబుళ్ళు సుబ్బారాయుడు, మురళి, జీనస్, ఈశ్వర్, గోవింద్ లతో వారి కదలికల పై నిఘా ఉంచి వారిని సమ్మర్ స్టోరేజ్ పక్కన పొలాల్లో దాక్కుని ఉండగా పట్టుకొని వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రెండు బంగారు చైన్లు మరియు చిన్నపిల్లల ఉంగరాలు మొత్తం 2.5 తులాల బంగారు నగలు మరియు 32 తులాల వెండి, దొంగతనానికి ఉపయోగించిన స్కూటీ వాహనాన్ని వారి నుండి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News