Kaizer News

చిత్తూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగేనా?

చిత్తూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగేనా?

· State - Telangana · prabhanews.com

వార్డుల సంఖ్య పెంచాలని ఎమ్మెల్యే లేఖ.. విభజనపై వైసీపీ న్యాయపోరాటం చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : చిత్తూరు కార్పొరేషన్‌కు ఎన్నికల ముహూర్తం ఎప్పుడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు వార్డుల విభజనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ న్యాయపోరాటం చేస్తుండగా.. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ నాయుడు సైతం ప్రస్తుత వార్డుల సంఖ్యపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే 50 వార్డులుగా ఉన్న చిత్తూరు మున్సిపాలిటీని 60 వార్డులకు పెంచుతూ విభజన ప్రక్రియ పూర్తయి నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ.. ఇప్పుడు మరో మూడు వార్డులు పెంచి మొత్తం 63 వార్డులు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో ఎన్నికల నిర్వహణపై కొత్త సందేహాలు నెలకొన్నాయి. చిత్తూరు మున్సిపాలిటీలో గతంలో 50 వార్డులు ఉండేవి. జనాభా పెరుగుదల, పట్టణ విస్తరణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వార్డుల సంఖ్యను 60కి పెంచింది. ఇందుకు అనుగుణంగా మున్సిపల్‌ అధికారులు వార్డుల పునర్విభజనపై కసరత్తు చేపట్టారు. ప్రతిపాదిత వార్డుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు మున్సిపాలిటీ నోటీసు బోర్డుల్లో ప్రదర్శించి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు. పెద్దగా అభ్యంతరాలు రాకపోవడంతో 60 వార్డుల విభజనను ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. అనంతరం వార్డుల విభజనకు నోటిఫికేషన్‌ కూడా వెలువడింది. అయితే వార్డుల విభజనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాస్త్రీయ ప్రాతిపదికన వార్డులను విభజించలేదని, అధికార పార్టీకి రాజకీయంగా అనుకూలించేలా విభజన జరిగిందని వారు ఆరోపించారు. జనాభా ప్రాతిపదిక, భౌగోళిక పరిస్థితులు, ఓటర్ల సంఖ్య వంటి అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా విభజన చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ఇదే తరహా అభ్యంతరాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోర్టులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులపై విచారణ చేపట్టిన హైకోర్టు పూర్వ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేయడంతో వార్డుల విభజన వ్యవహారం న్యాయపరమైన చిక్కుల్లో పడింది. చిత్తూరుతో పాటు ఇతర మున్సిపాలిటీలకు సంబంధించిన కేసులు కూడా పరిష్కారం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులపై తుది స్పష్టత వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి విజయానందరెడ్డి వార్డుల విభజనపై స్పందించారు. వార్డుల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భారీగా దొంగ ఓట్లు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత తాజా జనాభాను పరిగణనలోకి తీసుకుని వార్డుల సంఖ్య, రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పటి వరకు మున్సిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరి

Original source: prabhanews.com
Read more on Kaizer News