Shorts Kasinagar: స్మశాన వాటిక స్థల వివాదం పై ఇరు వర్గాల మధ్య ఆందోళన జరిగిన ఘటన గజపతి జిల్లా కాశీనగర్ సమితి కె.సీతాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని హరిజన వాడకు చెందిన కుటుంబాలు చాలా ఏళ్లుగా ఆ స్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నారు. ఓ వృద్ధ మహిళ మృతి చెందగా ఆ ప్రాంతానికి అంత్యక్రియలు చేసేందుకు వెళ్లగా కొంతమంది కాపు కులస్తులు అడ్డుకున్నారు. ఈ స్థలం తమదంటూ ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించే హక్కు లేదని అన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్నాయి. పోలీసు అధికారి అలోక్ జగదాల చేరుకొని ఇరు వర్గాలతో సంప్రదించి వివాదాన్ని సద్దుమణిగించారు