Kaizer News

ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు స్టార్‌ ప్లేయర్‌ దూరం..

ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు స్టార్‌ ప్లేయర్‌ దూరం.. షాక్‌లో సౌతాఫ్రికా!

· Sports · sakshi.com

ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్ సౌతాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ బౌల‌ర్ క‌గిసో ర‌బాడ తొడ‌ కండ‌రాల గాయంతో ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. గాయం తీవ్రత ఎక్కువ‌గా ఉండ‌డంతో ఆసీస్‌తో జ‌ర‌గ‌నున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా ర‌బాడ అందుబాటులో ఉండ‌డం అనుమానంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం డ‌బ్ల్యూటీ సీ ప‌ట్టిక‌లో సౌతాఫ్రికా 75 పీసీటీతో రెండో స్థానంలో కొన‌సాగుతోంది. వ‌చ్చే ఏడాది డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ జ‌ర‌గ‌నుండ‌డంతో ఈ సిరీస్‌కు సౌతాఫ్రికాకు కీల‌కం కానుంది. ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ, త‌మ నంబ‌ర్‌వ‌న్ స్థానాన్ని కాపాడుకోవాలంటే సౌతాఫ్రికా సిరీస్ ముఖ్య‌మే. డ‌బ్ల్యూటీసీ ప‌ట్టిక‌లో ఆస్ట్రేలియా 80 పీసీటీతో తొలి స్థానంలో ఉండ‌గా, సౌతాఫ్రికా (75 పీసీటీ), న్యూజిలాండ్ (72.22 పీసీటీ)తో వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒక‌వేళ ఆసీస్‌కు సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌ను కోల్పోతే పాయింట్లు ప‌డిపోవ‌డంతో పాటు మూడో స్థానానికి ప‌డిపోయే అవ‌కాశ‌ముంది. అప్పుడు మాజీ చాంపియ‌న్ న్యూజిలాండ్‌కు ఫైన‌ల్ ఆడే అవ‌కాశం ల‌భించ‌వ‌చ్చు. స్వ‌దేశంలో టీమిండియాతో న్యూజిలాండ్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నున్న సంగ‌తి తెలిసిందే. సొంత‌గ‌డ్డ‌పై ఆడ‌నుండ‌డం కివీస్‌కు సానుకూలాంశం కానుంది. ర‌బాడ‌కు ఏమైంది? ఆస్ట్రేలియాతో వ‌న్డే, టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికా జ‌ట్టు స‌న్నాహ‌కాలు ప్రారంభించింది. ప్రాక్టీస్ సంద‌ర్భంగా ర‌బాడ తొడ కండ‌రాల్లో చీలిక వ‌చ్చింది. స్కానింగ్‌లో ర‌బాడ గ్రేడ్‌-3 టియ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తేలింది. దీంతో ర‌బాడ క‌నీసం 9 నుంచి 10 వారాలు ఆట‌కు దూర‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. అయితే వ‌చ్చే నెల సెప్టెంబ‌ర్ 24 నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ర‌బాడ కోలుకోవ‌డానికి తొమ్మిది వారాలు స‌మ‌యం ప‌ట్ట‌నుండ‌డంతో వ‌న్డే సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత అక్టోబ‌ర్ 9 నుంచి 27 మ‌ధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నుంది. 9-10 వారాలు రెస్ట్ కావ‌డంతో ఈ లెక్క‌న రబాడ టెస్టు సిరీస్‌కు కూడా దూర‌మైన‌ట్లేన‌ని సౌతాఫ్రికా క్రికెట్ మెడిక‌ల్ టీమ్ ధృవీక‌రించింది. Read: గాయంతో కీలక బ్యాటర్‌ ఔట్‌.. పాకిస‍్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ! హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News