Kaizer News

Nellore: రేపు ఆత్మకూరు బైపాస్ రోడ్డు పనుల పరిశీలన

Nellore: రేపు ఆత్మకూరు బైపాస్ రోడ్డు పనుల పరిశీలన మంత్రి ఆనం!

· State - Telangana · hmtvlive.com

Nellore: రేపు ఆత్మకూరు బైపాస్ రోడ్డు పనులను పరిశీలించనున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ ప్రజల సౌకర్యార్థం సుమారు రూ.8.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనులను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రేపు పరిశీలించనున్నారు. సోమవారం సాయంత్రం 4.00 గంటలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బైపాస్ రోడ్డు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి, పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో నిర్మాణ పనుల పై సమీక్షించనున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News