Kaizer News

Vijayawada: క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న

Vijayawada: క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం!

· Sports · hmtvlive.com

Vijayawada: ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వై.ఎస్. షర్మిలా రెడ్డి గారి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ స్టేట్ టూర్‌లో భాగంగా, షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ శ్రీ జి.వి.వి.ఎస్. కమలాకర్ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇప్పటివరకు 14 జిల్లాల్లో పర్యటించి, అనేక మంది క్రీడాకారులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నామని కమలాకర్ తెలిపారు. రాష్ట్రంలోని అనేక క్రీడా మైదానాలు సరైన నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు అందడం లేదన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా ఎంపికల్లో ప్రతిభ కంటే డబ్బు, పలుకుబడికి ప్రాధాన్యత లభిస్తోందని క్రీడాకారులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. క్రీడా కోటా ఉద్యోగాల్లో కూడా డబ్బు, పలుకుబడి ప్రభావం చూపుతోందనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినట్లే, క్రీడా రంగంలో కూడా ప్రతిభకు కాకుండా డబ్బు, పలుకుబడికి ప్రాధాన్యత ఇస్తే ప్రతిభావంతులైన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కమలాకర్ విమర్శించారు. క్రీడల కోసం కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగం కాకపోవడం, కొన్ని ప్రాంతాల్లో నిధుల వినియోగంపై అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడం వంటి అంశాలను 14 జిల్లాల పర్యటనలో గుర్తించామని తెలిపారు. దేశానికి అత్యుత్తమ క్రీడాకారులను అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రతిభ ఉన్న ప్రతి క్రీడాకారుడికి అండగా నిలిచి, వారి హక్కులు మరియు న్యాయం కోసం పోరాడుతామని కమలాకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బొర్రా కిరణ్, శ్రీ నరహరిశెట్టి నరసింహారావు, శ్రీ భేగ్ పాల్గొన్నారు. మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News