టీమ్ ఇండియాతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ వన్డే, టీ20 జట్లను అధికారికంగా ప్రకటించింది. షాయ్ హోప్ సారథ్యంలోని 15 మంది సభ్యుల వన్డే జట్టులోకి అనుభవజ్ఞుడైన ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ తిరిగి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన గత సిరీస్‌లో హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా చివరి రెండు వన్డేలకు దూరమైన కాంప్‌బెల్, ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులో చేరాడు. ఆగస్టులో శస్త్రచికిత్స చేయించుకుని ఇంకా కోలుకుంటున్న అకీమ్ అగస్టే స్థానంలో యువ బ్యాటర్ జ్యువెల్ ఆండ్రూకు వన్డేల్లో అవకాశం దక్కింది. మరోవైపు స్టార్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మయర్ సిపిఎల్ ముగిసిన తర్వాత విశ్రాంతి కోరడంతో అతడిని వన్డేల నుంచి తప్పించి, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మాత్రమే ఎంపిక చేశారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు భారత్‌లోని ఎనిమిది నగరాల్లో ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. సీనియర్ హోల్డర్‌కు విశ్రాంతి పొట్టి ఫార్మాట్ జట్టులో యువ ప్రతిభకు పెద్దపీట వేశారు. విధ్వంసకర ఆటతీరుతో ఆకట్టుకున్న రైట్ హ్యాండ్ ఓపెనర్ కామెల్ పూరన్ తొలిసారి జాతీయ టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు. ఇటీవల కాలంలో 8 ఇన్నింగ్స్‌లలో 159.64 స్ట్రైక్ రేట్‌తో 273 పరుగులు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భాగమైన క్వెంటిన్ సాంప్సన్‌ను కూడా జట్టులోకి తీసుకోగా, సీనియర్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌కు ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించారు. హెట్‌మయర్, అకీల్ హుసేన్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్ వంటి పవర్‌ఫుల్ ప్లేయర్లు టీ20 జట్టును మరింత బలోపేతం చేస్తున్నారు. వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ లక్ష్యం.. ఈ సిరీస్‌లోని తొలి రెండు వన్డేలు 2027 వన్డే ప్రపంచకప్ ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ సైకిల్‌కు చివరి మ్యాచ్‌లుగా నిలవనున్నాయి. పాయింట్ల పట్టికలో వెనుకబడిన వెస్టిండీస్ వచ్చే ఏడాది ప్రారంభంలో క్వాలిఫైయర్ టోర్నమెంట్ ఆడాల్సి ఉంటుంది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో ఉన్న భారత్‌తో తలపడటం తమ జట్టుకు అత్యుత్తమ పరీక్ష అని హెడ్ కోచ్ డారెన్ సామీ పేర్కొన్నాడు. "ప్రపంచంలోనే టాప్ టీమ్‌తో ఆడటం మా ఆటతీరును మరింత మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశం. శ్రీలంకపై సాధించిన సిరీస్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో భారత్‌లోనూ గట్టి పోటీ ఇస్తాం. వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఒక బలమైన కోర్ టీమ్‌ను తయారుచేయడమే మా లక్ష్యం" అని సామీ తెలిపాడు. సెప్టెంబర్ 23న కేరళకు రాక.. వెస్టిండీస్ బృందం సెప్టెంబర్ 21న కరీబియన్ దీవుల నుంచి బయలుదేరి సెప్టెంబర్ 23న తిరువనంతపురం చేరుకోనుంది. అక్కడ తొలి వన్డేతో ఈ పర్యటన ప్రారంభం కానుంది. (IST) Tags : IND Vs WI Shai Hope West Indies Cricket John Campbell Kamil Pooran Daren Sammy Breaking News, Anytime, Anywhere - Download ABPLIVE on Android and iOS now! Khelo khul ke, sab bhool ke - only on Games Live --> Advertisement టాప్ హెడ్ లైన్స్ క్రికెట్ కొత్త టాలెంట్ రాగానే పాతవాళ్లను తీసేస్తారా..? సంజూని స్వేచ్ఛగా ఆడనివ్వండి, వైభవ్ ఎంట్రీపై అంజుమ్ చోప్ర