మహిళల టీ20 ఆసియా కప్ 2026 గ్రూప్ ఏ తొలి పోరులో ఇండియా ఘనవిజయం సాధించింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో థాయిలాండ్‌ను 94 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి టోర్నీని విజయంతో ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (171) పడగొట్టిన బౌలర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒక పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు (3/0) తీసి థాయిలాండ్ బౌలర్ తిపాట్చా పుత్తవాంగ్ రికార్డును అధిగమించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ సూపర్బ్ ఫిఫ్టీ (36 బంతుల్లో 64, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచింది. బౌలర్లలో లావోమీకి మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ లో థాయ్ లాండ్ 16.1 ఓవర్లలో 65 పరుగులకే కుప్పకూలింది. నన్నపత్ (41) టాప్ స్కోరర్ గా నిలిచింది. దీప్తితోపాటు నందని శర్మకు మూడు వికెట్లు దక్కాయి. షఫాలీ వర్మ మెరుపు హాఫ్ సెంచరీ.. చివర్లో కుప్పకూలిన భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్ షఫాలీ వర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో మంచి ఆరంభాన్ని అందించింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (19), అరంగేట్రం చేసిన ప్రతీకా రావల్ 18 బంతుల్లో 22 పరుగులు చేశారు. ఒక దశలో 108/2 తో 200 రన్స్ చేసేలా కనిపించిన భారత ఇన్నింగ్స్, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 137/9 కి పడిపోయింది. చివర్లో క్రాంతి గౌడ్ (15 నాటౌట్) పోరాడటంతో భారత్ 150 మార్కును దాటింది. దీప్తి, నందిని బౌలింగ్ మ్యాజిక్ 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన థాయిలాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఏ దశలోనూ కోలుకోనీయలేదు. కెప్టెన్ నరుఎమోల్ చైవాయ్ అందుబాటులో లేకపోవడం ఆ జట్టును దెబ్బతీసింది. వికెట్ కీపర్ బ్యాటర్ నన్నపత్ కొంచరోయెంకై 48 బంతుల్లో 41 రన్స్ చేసి ఒంటరి పోరాటం చేసినా, ఇతర బ్యాటర్ల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. దీంతో థాయిలాండ్ 65 పరుగులకే కుప్పకూలింది. ఇక బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్ తడబడినప్పటికీ బౌలింగ్ లో చూపించిన ఆధిపత్యంతో భారత్ పూర్తి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఈ భారీ విజయంతో టీమ్ ఇండియా నెట్ రన్ రేట్ ను భారీగా మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది. (IST) Tags : Shafali Verma Smriti Mandhana Deepti Sharma Suleeporn Laomi Nannapat Koncharoenkai Asia Cup 2026 Breaking News, Anytime, Anywhere - Download ABPLIVE on Android and iOS now! Khelo khul ke, sab bhool ke - only on Games Live --> Advertisement టాప్ హెడ్ లైన్స్ క్రికెట్ దీప్తి శర్మ వరల్డ్ రికార్డు .. థాయిలాండ్‌పై 94 రన్స్ తేడాతో ఇండియా విమెన్స్ భారీ విక్టరీ.. ఆసియాకప్ లో సూపర్బ్ బోణీ.. క్రికెట్ లగ్జరీ కార్లు వదిలేసి మెట్రో రైల్లో ప్రయాణం.. మాజీ స్టార్ పేసర్ శ్రీనాథ్ సింప్లిసిటీకి నెటిజన్ల ఫిదా.. క్రికెట్ 15 ఏళ్ల వయసులో సారథ్య బాధ్యతలు... ఇషాన్ కిషన్ గాయంతో ఈస్ట్ జోన్ పగ్గ