Kaizer News

టీ20 చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్.. హిస్టరీలోనే

టీ20 చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్.. హిస్టరీలోనే ఏకైక ప్లేయర్‌గా జోస్ బట్లర్..!

· Sports · hmtvlive.com

ప్రపంచ క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయి ఆవిష్కృతమైంది. ఇంగ్లండ్ వైట్ బాల్ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ (Jos Buttler) అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ సరికొత్త రికార్డును తన పేరు మీదకు మార్చుకున్నాడు. గురువారం నాడు శ్రీలంక (Sri Lanka) జాతీయ జట్టుతో జరిగిన రెండో టీ20 పోరులో ఈ చారిత్రక మైలురాయిని ఆయన స్పృశించాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో బౌలర్ ఈషాన్ మలింగ (Eshan Malinga) వేసిన బంతికి సింగిల్ తీయడం ద్వారా బట్లర్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ (West Indies) దిగ్గజ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బట్లర్ అధిగమించి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. పొలార్డ్ 754 మ్యాచ్‌లలో 14,999 పరుగులు సాధించగా, బట్లర్ కేవలం 528 మ్యాచ్‌లలోనే 15,000 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సోఫియా గార్డెన్స్ (Sophia Gardens) వేదికగా జరిగిన పోరులో ఇంగ్లండ్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 12.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. శ్రీలంకపై ఇంగ్లండ్‌కు ఇది వరుసగా పదో నాలుగో టీ20 విజయం కావడం విశేషం. అద్భుతమైన బౌలింగ్‌తో మూడు వికెట్లు పడగొట్టిన డాసన్ (Dawson) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఇప్పటివరకు తన సుదీర్ఘ కెరీర్‌లో వివిధ దేశీయ లీగ్‌లు, అంతర్జాతీయ టోర్నీలలో కలిపి బట్లర్ ఈ అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. లంకాషైర్ (Lancashire), మాంచెస్టర్ ఒరిజినల్స్ (Manchester Originals), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తదితర ప్రముఖ జట్ల తరపున ఆడిన అనుభవం ఆయన సొంతం. ఈ విజయంతో జోస్ బట్లర్ తన కెరీర్‌లో మరో అద్భుత అధ్యాయాన్ని జోడించుకున్నాడు. 2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను

Original source: hmtvlive.com
Read more on Kaizer News