Kaizer News

బాలాలయంలో అశోక్ చవాన్ దంపతుల పూజలు

బాలాలయంలో అశోక్ చవాన్ దంపతుల పూజలు

· State - Telangana · prabhanews.com

బాసర, ఆంధ్రప్రభ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ బాలాలయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ శంకర్‌రావు చవాన్ దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వారిని ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో అశోక్ చవాన్ దంపతులతో ఆలయ అర్చకులు కుంకుమార్చన పూజ నిర్వహించారు. అనంతరం హారతినిచ్చి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. పూజా కార్యక్రమం అనంతరం ఆశీర్వచన మండపంలో వారికి ప్రత్యేక సత్కారం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, సంజీవ్ పూజారి అశోక్ చవాన్ దంపతులను శాలువాలతో సత్కరించి అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, బీజేపీ మండల అధ్యక్షుడు సాయినాథ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News