Kaizer News

Neeraj Chopra: నీర‌జ్ చోప్రా మ‌డిమ‌కు గాయం.. ఆసియా

Neeraj Chopra: నీర‌జ్ చోప్రా మ‌డిమ‌కు గాయం.. ఆసియా గేమ్స్‌కు దూరం

· Sports · ntnews.com

న్యూఢిల్లీ: జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా(Neeraj Chopra)కు గాయ‌మైంది. కాలి మ‌డిమ వ‌ద్ద గాయ‌మైన‌ట్లు అత‌ను పేర్కొన్నాడు. దీంతో వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న ఆసియా క్రీడల‌కు నీర‌జ్ దూరం కానున్నాడు. రెండు సార్లు ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన నీర‌జ్ .. ఈసారి ఆసియా క్రీడ‌ల‌కు లేక‌పోవ‌డం భార‌త బృందానికి నిరాశే అవుతుంది. త‌న గాయం నుంచి నీర‌జ్… సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. లౌసానే డైమండ్ లీగ్ త‌ర్వాత ప్రాక్టీస్ స‌మ‌యంలో మ‌డిమ‌కు లింగ‌మెంట్ టియ‌ర్ అయిన‌ట్లు అత‌ను తెలిపాడు. చాన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మూమెంటం వ‌చ్చిన‌ట్లు భావించాన‌ని, లౌసానేలో సీజ‌న్ బెస్ట్ త్రో వేయాల‌ని భావించ‌న‌న్నారు. అయితే ట్రైనింగ్ స‌మ‌యంలో మ‌డిమ గాయ‌మైంద‌ని, డాక్ట‌ర్లు, త‌న టీమ్‌తో చ‌ర్చించిన త‌ర్వాత ఇక ఈ సీజ‌న్ నుంచి త‌ప్పుకోవాల‌ని డిసైడ్ అయిన‌ట్లు చెప్పాడు. ఇది నిరాశ క‌లిగించే అంశ‌మే కానీ, క్రీడ‌ల్లో ఇదంతా భాగ‌మే అన్నారు. రిక‌వ‌రీపైనే ఇప్పుడు తాను ఫోక‌స్ పెట్టిన‌ట్లు నీర‌జ్ చెప్పారు. మ‌రింత దృఢంగా మ‌ళ్లీ రానున్న‌ట్లు తెలిపాడు. ఈ సీజ‌న్ మొత్తం దూరం కావ‌డం అంటే, అత‌ను డైమండ్ లీగ్ ఫైన‌ల్ కూడా మిస్‌కానున్నాడు. వాస్త‌వానికి ఆ మీట్‌కు అత‌ను క్వాలిఫై అయ్యాడు. ఇక ఆసియా క్రీడ‌లు సెప్టెంబ‌ర్ 19 నుంచి ప్రారంభంకానున్నాయి

Original source: ntnews.com
Read more on Kaizer News