Kaizer News

నిద్రలో నడిచే హీరో.. ఇతడిని గుర్తుపట్టారా?

నిద్రలో నడిచే హీరో.. ఇతడిని గుర్తుపట్టారా?

· Entertainment · sakshi.com

నిద్రలో నడిచే(స్లీప్ వాకింగ్) యంగ్ హీరో ఎవరు అని సోషల్ మీడియాలో వైరల్ అయిన సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ ప్రకటన చేశారు. స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ కాగా ఇతడి కొత్త సినిమా "టార్టాయిస్" అని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అమృత చౌదరి హీరోయిన్ కాగా అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాని విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ దీనిని తెరకెక్కిస్తున్నారు. మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్.. సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఒక డెడ్ బాడీ పక్కన హీరో రాజ్ తరుణ్ రక్తపు మరకలతో కూర్చుని ఉండటం, ఆయన పక్కనే ఒక కత్తి పడి ఉండటం ఆసక్తి రేపుతోంది. షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు) ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నీకే చెప్తున్నా.. జగన్ పై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన సజ్జల నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

Original source: sakshi.com
Read more on Kaizer News