విజయనగరంలో జరిగిన వైఎస్సార్‌సీపీ సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ మారేవారి గురించి కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఒకరు వెళితే, వంద మంది కొత్త నాయకులు వస్తారని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడిన నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎవరైతే ఆర్థిక లావాదేవీలు జరిపి, […]