పరిగి రూరల్, ఆంధ్రప్రభ : దోమ మండలం మోత్కూర్ గ్రామంలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవలో గోపాల్ అనే యువకుడిపై నర్సింహులు, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో గోపాల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది