రేణిగుంట: రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నాస్వామిపల్లి గ్రామంలో వివాహిత మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వరకుమారి (35) అనే మహిళ సుమారు 11 సంవత్సరాల క్రితం చాణుక్యను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో శనివారం వరకుమారి ఇంటి మొదటి అంతస్తులోని రేకుల షెడ్డు వద్ద చీరతో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై మృతురాలి తల్లి డి. మునిమ్మ (60) ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మహిళ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఊహాగానాలు, నిర్ధారణకు రాని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు