Kaizer News

అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 8 రోజుల్లో 4 బిల్లులకు ఆ

అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 8 రోజుల్లో 4 బిల్లులకు ఆమోదం

· State - Telangana · ntnews.com

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. శుక్రవారం చివరి రోజు ఎల్‌ నినోపై చర్చ అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు. సభ కార్యకలాపాల వివరాలను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు. 8 రోజుల్లో 51 గంటల 52 నిమిషాలు సభ నిర్వహించినట్టు తెలిపారు. 4 బిల్లులకు ఆమోదం తెలిపినట్టు వివరించారు. 22ఏ భూముల సమస్యపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News