Kaizer News

విద్య, వైద్య, వ్య‌వ‌సాయ‌ రంగాలకు పెద్దపీట

విద్య, వైద్య, వ్య‌వ‌సాయ‌ రంగాలకు పెద్దపీట

· State - Telangana · prabhanews.com

విద్య, వైద్య, వ్య‌వ‌సాయ‌ రంగాలకు పెద్దపీట పాడి, పరిశ్రమల మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఊట్కూర్, ఆంధ్రప్రభ: నేటి సమాజంలో బీకేఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని పాడి, పరిశ్రమల మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా మనిషి ఎంత సంపాదించినా.. ఎంత ఆస్తి కూడబెట్టినా చివరికి వెంట తీసుకెళ్లేది ఏమీ లేదని.. అయితే మనం చేసిన సేవ, మంచి పనులు మాత్రం సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సేవ చేయాలనే సంకల్పంతో ఇలాంటి మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమన్నారు. మన వల్ల ఒక కుటుంబానికి జీవనోపాధి లభించినా, ఒక వ్యక్తి జీవితంలో మార్పు వచ్చినా అదే నిజమైన సేవ అని పేర్కొన్నారు. మండల ప్రజలు ఈ మెగా హెల్త్ క్యాంప్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా, వైద్య ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. జీవో 69 మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో ఊట్కూర్ మండలం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. వలసలు వెళ్లే వారి తిరిగివచ్చి వలసలే మనం పిలుచుకునే విధంగా ఊట్కూర్ మారపోతుందన్నారు. మక్తల్ నారాయణపేట నాలుగు లైన్ల రహదారి పనులు త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. భూ నిర్వాసితులకు సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి ఎకరాకు రూ. 20 లక్షలు పరిహారం చెల్లించినట్లు గుర్తు చేశారు. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు పార్టీలకతీతంగా సహకరించాలని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. అంగన్వాడి కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు ట్యాబులు, వృద్ధులు, పేదలకు బి కే ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్, డీఎంహెచ్‌ఓ జయచంద్ర మోహన్, బీకేఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, డిప్యూటీ తహ‌సీల్దార్ చింతా రవి, సర్పంచ్ ఏం. రేణుక భరత్, సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి,ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News