పేద మహిళపై టౌన్ సీఐ దాష్టీకాన్ని ఖండిస్తూ బంద్ సీఐని సస్పెండ్ చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ కోదాడ, ఆంధ్రప్రభ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మూడు దశాబ్దాలుగా పాన్ డబ్బా నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న నిరుపేద మహిళ గంధం కనకమ్మపై కోదాడ టౌన్ సీఐ అమానుషంగా వ్యవహరించారంటూ ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం కోదాడ బంద్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నాయకత్వంలో చేపట్టిన ఈ బంద్‌కు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. అధికార బలంతో సామాన్య నిరుపేద మహిళపై పాశవికంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు. బాధిత మహిళకు న్యాయం చేయడంతో పాటు సంబంధిత సీఐని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బంద్‌లో భాగంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ ప్రశాంతంగా కొనసాగినట్లు సమాచారం