Kaizer News

ఓవర్సీస్‌పై వివరణ ఇవ్వండి.. బీసీ సంక్షేమశాఖకు కమిష

ఓవర్సీస్‌పై వివరణ ఇవ్వండి.. బీసీ సంక్షేమశాఖకు కమిషన్‌ చైర్మన్‌ లేఖ

· State - Telangana · ntnews.com

హైదరాబాద్‌, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): బీసీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్పుల్లో ఈబీసీలకు 100సీట్లు ఏ ప్రాతిపదికన కేటాయించారనేదానిపై సమగ్రమైన వివరాలు ఇవ్వాలని బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌ను రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ ఆదేశించారు. శనివారం లేఖ రాశారు. ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం కింద ఫాల్‌సీజన్‌కు సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలని బీసీ సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ సీజన్‌లో బీసీలకు 250, ఈబీసీలకు 100 మొత్తంగా 350 మందికి స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయనున్నట్టు కమిషన్‌ ఇటీవల ప్రకటించింది. ఈబీసీలకు ఏ ప్రాతిపదికన 100 సీట్లు మంజూరు చేస్తున్నారనేదానిపై వివరణ ఇవ్వాలని కమిషన్‌ తాజాగా ఆదేశించింది. ఏ ప్రమాణాలు అనుసరించారనేది తెలుపాలని కమిషన్‌ వివరణ అడిగింది

Original source: ntnews.com
Read more on Kaizer News