పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: తిమ్మాజిపేట మండలం బుద్ధసముద్రం గ్రామంలో శ్రీ పోచమ్మ దేవాలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో దేవాలయ విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. బుద్ధసముద్రం గ్రామ అభివృద్ధికి భవిష్యత్తులో తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని, తన శక్తిమేరకు గ్రామ అభివృద్ధికి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆవుల రామాంజనేయులు, ఉపసర్పంచ్ అరుణ, మండల అధ్యక్షుడు చిలుక వివేక్‌రెడ్డి, వెంకట్‌రామ్‌రెడ్డి, మల్లయ్యగౌడ్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు