పత్తికొండ: అండర్-17 వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచి పత్తికొండ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకువచ్చిన పత్తికొండకు చెందిన యువ క్రీడాకారుడు ఆఫ్రిద్‌ను పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ అభినందించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఆఫ్రిద్‌ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆఫ్రిద్ సాధించిన విజయాలను ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. “కష్టపడి సాధన చేస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించవచ్చు. ఆఫ్రిద్ విజయాలు ఇతర యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాలి” అని ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ అన్నారు