Kaizer News

Rayachoti: నెల్లూరు వద్ద 1000 ఎకరాల్లో స్పోర్ట్స్

Rayachoti: నెల్లూరు వద్ద 1000 ఎకరాల్లో స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్!

· Sports · hmtvlive.com

Rayachoti: తిరుపతి ఎస్వీయూ ఆడిటోరియంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్ ముగింపు వేడుకలకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి , శాప్ చైర్మన్ రవినాయుడు MLA ఆరని శ్రీనివాసులు, MLC సోమిరెడ్డి చంద్రమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి గారు క్రీడాకారులను అభినందించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 26 జిల్లాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్‌-17, అండర్‌-23 విభాగాల్లో 12 క్రీడాంశాల్లో 2.07 లక్షల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలు, రన్నర్లను ప్రోత్సహించేందుకు రూ.91.90 లక్షల ప్రైజ్‌మనీ అందించరు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికతో రాబోయే 50 ఏళ్ల అవసరాలకు సరిపడే క్రీడా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. క్రీడాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, నెల్లూరు పరిసరాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రీడా కార్యక్రమానికి ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు లభించడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని మంత్రి మండిపల్లి పేర్కొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News