Kaizer News

Kurnool: కప్పట్రాళ్లలో ఘనంగా ఆర్కే రవికృష్ణ జన్మది

Kurnool: కప్పట్రాళ్లలో ఘనంగా ఆర్కే రవికృష్ణ జన్మదిన వేడుకలు!

· State - Telangana · hmtvlive.com

Kurnool: కప్పట్రాళ్ల ఆర్కే రవికృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కప్పట్రాళ్ల గ్రామంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సుమారు 40 మంది యువకులు, పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. కప్పట్రాళ్ల గ్రామంలో ఆర్కే రవికృష్ణ గారి జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి దేవనకొండ సీఐ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కర్నూల్ బ్లడ్ బ్యాంకు సహకారంతో తలసేమియా చిన్నారుల కోసం దాదాపు 40 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా సురేంద్ర నాయుడు మాట్లాడుతూ, ఆర్కే రవికృష్ణ కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకుని ఫ్యాక్షన్ నిర్మూలనతో పాటు యువత, విద్యార్థులు, మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో గ్రామం మండలంలో ఆదర్శ గ్రామంగా నిలిచిందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఆయన చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కప్పట్రాళ్ల యువత అండగా ఉంటుందని తెలిపారు. అదే విధంగా ఆర్కే రవికృష్ణ గ్రామ అభివృద్ధిపై రూపొందించిన ప్రత్యేక యూట్యూబ్ సాంగ్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లికార్జున, కోటకొండ దేవేంద్ర గౌడ్, గ్రామ పెద్దలు, యువకులు, కర్నూల్ బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News