Kaizer News

Car Accident | కోస్టల్‌ రోడ్డుపై అదుపుతప్పిన కారు.

Car Accident | కోస్టల్‌ రోడ్డుపై అదుపుతప్పిన కారు.. ముగ్గురు విద్యార్థులు మృతి

· National - India · prabhanews.com

డివైడర్‌ను ఢీకొని 75 అడుగుల లోతులో పడిన కారు మరో విద్యార్థి పరిస్థితి విషమం Car Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ముంబై కోస్టల్‌ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు డివైడర్‌ను ఢీకొని సుమారు 75 అడుగుల లోతులో పడిపోవడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో నలుగురు విద్యార్థులు మెరైన్‌ డ్రైవ్‌ నుంచి ఉత్తర దిశగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను సనయ్‌ గుజ్జర్‌ (21), ఆదిత్య జకసానియా (19), ధైర్య షేత్‌ (17)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆదిత్య ఓస్వాల్‌ (23)ను నాయర్‌ ఆస్పత్రికి తరలించగా, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో గుజ్జర్‌, ఓస్వాల్‌, షేత్‌ విరార్‌ పార్లేలోని ఓ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో బీబీఏ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. అహ్మదాబాద్‌కు చెందిన గుజ్జర్‌ ముంబైలో పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటున్నాడని, ప్రమాదానికి గురైన బీఎండబ్ల్యూ కారు అతడి కుటుంబానికి చెందినదని వెల్లడించారు. కారు అధిక వేగంతో వెళ్తుండటంతో గుజ్జర్‌ నియంత్రణ కోల్పోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. తొలుత కారు కోస్టల్‌ రోడ్డుపై ఉన్న బయటి గోడను ఢీకొని, అనంతరం సుమారు 75 అడుగుల లోతులో పడిపోయినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. మృతుల స్నేహితులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తూ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News