Shorts వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన కుటుంబాలకు శనివారం రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలను అందజేశారు. వేలేరుపాడు మండలం రేపాక గొమ్ము పంచాయతీ పరిధిలోని రేపాక గొమ్ము, సంతబజారు, వేలేరుపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీ, ఎర్రబోరు గ్రామాలకు చెందిన 419 కుటుంబాలకు పునరావాసం నిమిత్తం జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో నిర్మించిన ఇళ్లకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు,రెవిన్యూ సిబ్బంది,టీడీపీ నాయకులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు శాఖామూరి సంజీవులు, రాధాకృష్ణ, తెలుగు యువత అధ్యక్షుడు కోటిపల్లి ముత్యాలరావు, ఉపాధ్యక్షుడు కురిమెళ్ల కృష్ణ, యూత్ లీడర్లు పోషి బాబు, అంజిబాబు, సలీమ్, సంతోష్, జనసేన నాయకులు బి.శివరామ్, చంటి తదితరులు పాల్గొన్నారు