వరుసగా రెండో రోజు భారీ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరట.. 24 క్యారెట్లపై రూ.1,470 తగ్గింపు GOLD PRICE TODAY | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం కూడా పసిడి ధరల్లో భారీ తగ్గుదల నమోదైంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ.1,470 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.1,350, 18 క్యారెట్ల బంగారంపై రూ.830 చొప్పున ధర తగ్గింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది. గుడ్‌రిటర్న్స్ ప్రకారం… సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,770 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,700గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,850 వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధరలో ఒకేరోజు రూ.1,470 తగ్గడం గమనార్హం. 22, 18 క్యారెట్ల బంగారం ధరలు కూడా అదే బాటలో పయనించాయి. వరుసగా రెండో రోజు ధరలు తగ్గడంతో బంగారం కొనుగోలుదారులు ప్రస్తుత ధరలను పరిశీలిస్తున్నారు