Kaizer News

జపాన్‌లో టీమిండియా రచ్చ.. త్రివర్ణ పతాకంతో మను భాక

జపాన్‌లో టీమిండియా రచ్చ.. త్రివర్ణ పతాకంతో మను భాకర్, పవన్ షెరావత్.. ఆసియా గేమ్స్ రచ్చ షురూ!

· National - India · v6velugu.com

Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా 20వ ఆసియా గేమ్స్ (Asian Games 2026) సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు (సెప్టెంబర్ 18న, శనివారం) నాగోయాలోని పాలోమా మిజుహో స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీలో ఆసియా ఖండంలోని క్రీడా జ్యోతులన్నీ ఒక్కటై కవాతు చేశాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమైన ఈ ఐకానిక్ పరేడ్‌లో భారత అథ్లెట్ల బృందం సరికొత్త లుక్‌తో స్టేడియాన్ని మురిపించింది. అథ్లెట్స్ పరేడ్ కోసం భారత బృందం ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. * గుజరాతీ స్టైల్ చీరల్లో లేడీ స్టార్స్: భారత మహిళా అథ్లెట్లు సాంప్రదాయ గుజరాతీ స్టైల్ పల్లూతో కూడిన నేవీ-బ్లూ కలర్ చీరలు ధరించి అప్సరసల్లా మెరిసిపోయారు. * పురుషులకు రాయల్ బంధ్‌గలా: పురుషుల అథ్లెట్లు క్లాసిక్ నేవీ-బ్లూ బంధ్‌గలా దుస్తులతో అత్యంత రాచరికంగా కనిపించారు. భారత సాంప్రదాయం, ఆధునికత కలగలిసిన ఈ డ్రెస్సింగ్ స్టైల్ చూసి స్టేడియంలోని ప్రేక్షకులు ఈలలు, కేరింతలతో హోరెత్తించారు. * భారత త్రివర్ణ పతాకాన్ని గర్వంగా చేతపట్టుకుని అథ్లెట్స్ పరేడ్‌ను ముందుండి నడిపించే అవకాశం ఇద్దరు క్రీడా దిగ్గజాలకు దక్కింది. * ధమాకా జంట: రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన షూటింగ్ స్టార్ మను భాకర్, కబడ్డీ కింగ్ పవన్ షెరావత్ భారత ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. * ఆఖరి నిమిషంలో చేంజ్: నిజానికి పురుషుల విభాగానికి స్టార్ షాట్‌పుటర్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించాల్సి ఉంది. కానీ అతడికి అధికారిక కిట్ సమయానికి అందకపోవడంతో చివరి నిమిషంలో అతడి స్థానంలో పవన్ షెరావత్‌ను ఫ్లాగ్ బేరర్‌గా సెలక్ట్ చేశారు. ఈ సారి ఆసియా గేమ్స్‌ లో పతకాల సునామీ సృష్టించేందుకు భారత్ భారీ అథ్లెట్ల బృందాన్ని బరిలోకి దించింది. 503 మంది అథ్లెట్లు: మొత్తం 503 మంది సభ్యులతో కూడిన దళం జపాన్ గడ్డపై అడుగు పెట్టింది. ఇందులో 269 మంది పురుషులు, 234 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. * 36 ఈవెంట్లలో పోటీ: మొత్తం 36 క్రీడాంశాల్లో భారత ఆటగాళ్లు పసిడి పతకాలే లక్ష్యంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. * ఓపెనింగ్ సెర్మనీ తో ఆసియా గేమ్స్ అధికారికంగా షురూ అవ్వడంతో, ఇకపై జపాన్ గడ్డపై పతకాల యుద్ధం ఏ స్థాయిలో ఉండబోతోందో చూడాలి మరీ

Original source: v6velugu.com
Read more on Kaizer News