Kaizer News

Nakrekal: గురుకుల విద్యార్థులకు యూనిఫామ్‌లు, బ్యాగ

Nakrekal: గురుకుల విద్యార్థులకు యూనిఫామ్‌లు, బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

· State - Telangana · hmtvlive.com

Nakrekal: నకిరేకల్ పట్టణం లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్‌లు, స్కూల్ బ్యాగులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మెస్ ఛార్జీలను పెంచామని, పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందుతుందో లేదో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గురుకుల విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, విద్యార్థులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News