చంద్రగిరి : మండలంలోని కూచువారిపల్లె వద్ద ఇంటి నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గోతిలో ఓ జింక ప్రమాదవశాత్తు ఆదివారం పడిపోయింది. వివరాలు.. అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి గ్రామంలోకి వచ్చి జింకపై కుక్కల దాడి చేశాయి. ప్రాణాలను కాపాడుకునే క్రమంలో పరుగులు తీసిన జింక పిల్లర్ గోతిలో పడింది. గమనించిన స్థానికులు వెంటనే జింకను రక్షించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది ప్రాథమిక చికిత్సను అందించి నాగపట్ల పరిధిలోని కల్యాణీ డ్యామ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. తిరుమల: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా, మండపేటకు చెందిన లక్ష్మీరాణి (53), భర్త పి.రాంబాబు, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం ఆదివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో శ్రీవారి ఆలయం నుంచి బయటకు వచ్చిన ఆమె.. ఎస్‌క్యూ–1 గేట్ వద్ద కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. లక్ష్మీరాణి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఎవరితోనూ మాట్లాడకుండా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటారని తెలిపారు. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, తిరుమల పోలీసులు గాలిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిస్తే 9440796772, 9440796771 సంప్రదించాలని సూచించారు. నాయుడుపేట టౌన్ : నాయుడుపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీనివాసులును జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి వీఆర్‌కు పంపినట్టు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు