Kaizer News

Paderu: పాడేరులో పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో అల

Paderu: పాడేరులో పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు

· State - Telangana · hmtvlive.com

Shorts Paderu: అల్లూరు జిల్లా పాడేరులో, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS - Public Grievances Redressal System) లో ప్రజల నుండి వచ్చే అర్జీలను నిర్దేశిత గడువులోగా, సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిషాంతి. టి అధికారులను ఆదేశించించారు. శుక్రవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేయాలి వేదిక ( పిజిఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజల సౌకర్యార్థం శాఖలవారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిషాంతి. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ, డీఆర్‌ఓ ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు నేరుగా పాల్గొని అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ​ అధికారులకు జిల్లా కలెక్టర్ జారీ చేసిన సూచనలు ప్రకారం పిటిషన్ దారుతో ​మర్యాదపూర్వక ప్రవర్తించి పిజిఆర్ఎస్‌కు వచ్చే అర్జీదారులతో అధికారులు సిబ్బంది మర్యాదపూర్వకంగా మాట్లాడి, వారి సమస్యలను పూర్తి వివరాలతో అడిగి తెలుసుకోవాలని , శాఖల ​ సమన్వయంతో అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయాలని, దాఖలైన వినతులను సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. శాఖల వారిగా ​ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి శాఖకు ప్రత్యేక కౌంటర్ కేటాయించి అర్జీల నమోదు సులభతరం చేశారు. ​ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News