భారత రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో ఉన్నదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ మేనక గురుస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో భిన్నాభిప్రాయాలను అణచివేస్తే ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లో దివంగత ఎంపీ ఎస్ జైపాల్‌రెడ్డి మెమోరియల్, మంథన్ ఫౌండేషన్ నిర్వహించిన ‘ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రొటెక్షన్' సదస్సులో ఆమె నల్సార్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావుతో కలిసి ముఖ్యవక్తగా ప్రసంగించారు