Kaizer News

Tamil-Nadu-Midday-Meal : మిడ్డే మీల్‌.. కోడి బిర్య

Tamil-Nadu-Midday-Meal : మిడ్డే మీల్‌.. కోడి బిర్యానీ Andhra Prabha Top News

· National - India · prabhanews.com

మిడ్డే మీల్‌.. కోడి బిర్యానీ Andhra Prabha Top News ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ చికెన్‌ బిర్యానీ వడ్డించాలన్న ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ ఆకాంక్ష మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌ మోహన్‌ వెల్లడించారు. అయితే, అదేదో రేపటి నుంచే విద్యార్థుల ప్లేట్లలోకి వచ్చేస్తుందని అనుకుంటే పొరపాటే! ముందుగా ప్రయోగాత్మకంగా అమలు చేసి, వంట తయారీ నుంచి వడ్డింపు వరకు అన్ని ఏర్పాట్లనూ పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోనున్నారు. పరిశుభ్రత, ఆహార భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చికెన్‌ బిర్యానీ అందించాలన్న ప్రతిపాదనను సమర్థిస్తూ మంత్రి రాజ్‌ మోహన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అన్ని గౌరవ మర్యాదలతో చెబుతున్నా.. జైళ్లలో ఖైదీలకు సైతం చికెన్‌ బిర్యానీ పెడుతున్నారు. మరి మన విద్యార్థులకు ఎందుకు పెట్టకూడదు?” అని ప్రశ్నించారు. ఈ పథకాన్ని తక్షణమే అమలు చేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం తయారుచేసి, సురక్షితంగా వడ్డించేలా ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. ముందుగా పైలట్‌ ప్రాజెక్టు చేపట్టి, పరీక్షించిన తర్వాతే విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చికెన్‌ బిర్యానీ అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి ఒకసారి చికెన్‌ బిర్యానీ అందించాలన్న ఆలోచన తొలిసారిగా జూలైలో వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి విజయ్‌ ముందుంచినట్లు అప్పట్లో మంత్రి రాజ్‌ మోహన్‌ తెలిపారు. దీనిపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని పేర్కొన్నారు.పెరుగుతున్న పిల్లలకు తగిన మోతాదులో ప్రొటీన్లు అందడం ఎంతో ముఖ్యమని, అందులో భాగంగానే చికెన్‌ బిర్యానీ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. విద్యార్థుల పోషకాహారానికి సంబంధించిన అంశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో విద్యా విప్లవం ఎప్పుడూ పోషకాహార విప్లవంతో కలిసే సాగిందని గతంలో మంత్రి వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఆరోగ్యం, ఎదుగుదల, విద్యాభ్యాసం.. ఈ మూడింటికీ పోషకాహారం కీలకమని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. చికెన్‌ బిర్యానీ ప్రతిపాదన అమలులోకి వచ్చినా.. శాఖాహార విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ భోజనం కొనసాగించనున్నారు. శాఖాహారం ఇష్టపడే విద్యార్థులకు వెజిటేరియన్‌ మీల్స్‌ అందిస్తామని, మాంసాహారం తినే విద్యార్థులు చికెన్‌ బిర్యానీని ఎంచుకునే అవకాశం ఉంటుందని గతంలో మంత్రి స్పష్టం చేశారు.విద్యార్థుల ఆహారపు అలవాట్లు, అభిరుచులను పరిగణనలోకి తీసుకుంటూనే ఈ పథకాన్ని అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయాలంటే భారీ స్థాయిలో వంట ఏర్పాట్లు అవసరం. ఆహార పదార్థాల నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, భోజనం తయారీ, రవాణా, వడ్డింపు వంటి అంశాలను అధికారులు ముందుగ

Original source: prabhanews.com
Read more on Kaizer News