Kaizer News

ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం: స్టీఫెన్‌ రవీంద్ర

ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం: స్టీఫెన్‌ రవీంద్ర

· State - Telangana · ntnews.com

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (నమస్తే తెలంగాణ) : అక్టోబర్‌ మొదటి వారం నాటికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించేందుకు స్టోరేజ్‌, హమాలీ, ట్రాన్స్‌పోర్ట్‌ ఆధారిత ‘ఎస్‌హెచ్‌టీ’ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ ఎం స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధారణ గోదాములతోపాటు మూతపడిన రైస్‌ మిల్లులు, ఇండస్ట్రియల్‌ షెడ్లు, ఏఎంసీ ఆవరణలు, ఫంక్షన్‌ హాళ్లను సైతం నిల్వ కోసం వినియోగించుకోవాలని సూచించారు. హమాలీల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2026-27 వానకాలానికి సంబంధించి సుమారు 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్ల కోసం పౌర సరఫరాల శాఖ సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News