Kaizer News

Gopalapuram: పార్డ్ ఇండియా సేవలు అభినందనీయం: ఎస్సై

Gopalapuram: పార్డ్ ఇండియా సేవలు అభినందనీయం: ఎస్సై సుబ్రహ్మణ్యం

· National - India · hmtvlive.com

Shorts Gopalapuram: గోపాలపురం మండలం పెద్దగూడెంలో ప్రగతి అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (పార్డ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘బడి తరువాత’ ట్యూషన్ సెంటర్‌ను గోపాలపురం ఎస్సై వి. సుబ్రహ్మణ్యం శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా డి. వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు అదనపు జ్ఞానాన్ని అందించేందుకు పార్డ్ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. విద్య ద్వారానే ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను సాధించగలరని, విద్యార్థులకు లక్ష్యంతో కూడిన విద్య ఎంతో అవసరమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇటువంటి ట్యూషన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలలకు విద్యతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పార్డ్ సంస్థ అధ్యక్షులు డి. వెంకటేష్, సహాయ కార్యదర్శి ఆర్. భాస్కరరావు మాట్లాడుతూ ట్యూషన్ సెంటర్‌లో ఆశ్రమ, నవోదయ తదితర పాఠశాలల ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణతో పాటు అవసరమైన పుస్తకాలు అందిస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత కుట్టుశిక్షణ, విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పీఆర్వోలు దాసరి రామారావు, పాముల తిరుపతయ్య, ట్యూషన్ టీచర్ చింతలపూడి మౌనిక, కాలనీ పెద్దలు బొంత శ్రీరాములు, పాలంగి రాజు, విద్యార్థులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News