Kaizer News

Khammam: కేజీబీవీ కొణిజర్లలో మెన్స్ట్రువల్ హైజీన్‌

Khammam: కేజీబీవీ కొణిజర్లలో మెన్స్ట్రువల్ హైజీన్‌పై అవగాహన సదస్సు!

· State - Telangana · hmtvlive.com

Shorts ఖమ్మం, సెప్టెంబర్ 19: బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లాలోని కేజీబీవీ కొణిజర్లలో విద్యార్థినులకు మెన్స్ట్రువల్ హైజీన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీహెచ్‌ఈడబ్ల్యూ–డీఎంసీ మాట్లాడుతూ, రుతుస్రావం అనేది బాలికల జీవితంలో సహజమైన శారీరక ప్రక్రియ అని, దీనిపై ఎలాంటి భయం, సిగ్గు లేదా సంకోచం అవసరం లేదని తెలిపారు. ప్రతి బాలిక వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శానిటరీ న్యాప్‌కిన్లను సక్రమంగా ఉపయోగించి, సమయానికి మార్చి, పరిశుభ్రంగా పారవేయాలని సూచించారు. అలాగే పోషకాహారం, ఐరన్‌–ఫోలిక్‌ యాసిడ్‌ ఉన్న ఆహారం తీసుకోవడం, రక్తహీనతను నివారించడం, తగినంత నీరు తాగడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని వివరించారు. విద్యార్థినుల భద్రతపై మాట్లాడుతూ గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌ గురించి బొమ్మ సహాయంతో అవగాహన కల్పించారు. మంచి స్పర్శ, చెడు స్పర్శను గుర్తించడం, నచ్చని స్పర్శకు ధైర్యంగా “నో” చెప్పడం, వెంటనే నమ్మకమైన పెద్దలకు తెలియజేయడం వంటి విషయాలను వివరించారు. బాలికలు తమ ఆరోగ్యం, భద్రత, విద్య మరియు భవిష్యత్తుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, బాల్య వివాహాలకు దూరంగా ఉండి ఉన్నత విద్యను కొనసాగిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని డీహెచ్‌ఈడబ్ల్యూ–డీఎంసీ సూచించారు. ఈ కార్యక్రమంలో DHEW Gender Specialists p ప్రమీల, R వాసంతి, k. సతీష్ DHEW సిబ్బంది, కేజీబీవీ సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News