Kaizer News

Nihang Group Assaults Woman Cop | ఒక వ్యక్తిని కాప

Nihang Group Assaults Woman Cop | ఒక వ్యక్తిని కాపాడిన మహిళా పోలీస్‌.. నిహంగ్‌ సిక్కులు ఆమెపై దాడి

· National - India · ntnews.com

చండీగఢ్‌: ఒక వ్యక్తిపై దాడిని అడ్డుకుని అతడ్ని కాపాడేందుకు మహిళా పోలీస్‌ అధికారిణి ప్రయత్నించారు. అయితే నిహంగ్‌ సిక్కుల గుంపు ఆమెపై దాడి చేశారు. ఆ పోలీస్‌ అధికారిణి డ్రెస్ కాలర్‌ పట్టుకుని ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. (Nihang Group Assaults Woman Cop) పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి కొంతమంది నిహంగ్‌ సిక్కులు అమృత్‌సర్‌లోని ఝబాల్ రోడ్డుపై రాస్తారోకో, నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రత్యర్థి వర్గానికి చెందిన ఒక నిహంగ్‌ సిక్కు బైక్‌పై అక్కడి వచ్చాడు. అయితే ప్రత్యర్థి వర్గం గూఢచర్యం కోసం అతడ్ని అక్కడకు పంపినట్లు నిరసనకారులు అనుమానించారు. ఈ నేపథ్యంలో అతడిపై దాడి చేశారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న గేట్ హకీమా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) మంజీత్ కౌర్ తన పోలీస్‌ బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి గురైన వ్యక్తిని రక్షించేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో నిరసన చేస్తున్న నిహంగ్ సిక్కులు, ఆ పోలీస్‌ అధికారిణి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొందరు నిహంగ్‌ సిక్కులు ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీస్‌ అధికారిణి డ్రెస్‌ కాలర్‌ పట్టుకుని నెట్టగా వారిని ప్రతిఘటించేందుకు ఆమె ప్రయత్నించారు. ఇంతలో గాయపడిన ప్రత్యర్థి వర్గం నిహంగ్ సిక్కును వాహనంలోకి పోలీసులు ఎక్కించారు. పోలీస్‌ అధికారిణి మంజిత్‌ కౌర్‌ తన బృందంతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే నిరసన చేస్తున్న నిహంగ్‌ సిక్కులు పోలీస్‌ అధికారిణి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది

Original source: ntnews.com
Read more on Kaizer News