Kaizer News

Antarvedi: అంతర్వేది బీచ్‌లో స్వచ్ఛతకు శ్రీకారం చు

Antarvedi: అంతర్వేది బీచ్‌లో స్వచ్ఛతకు శ్రీకారం చుట్టిన గొల్లపల్లి అమూల్య!

· State - Telangana · hmtvlive.com

Shorts Antarvedi: డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది బీచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య కార్యకర్తలతో కలిసి శనివారం పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. బీచ్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా ఏరుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ.. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని అన్నారు. పర్యాటక ప్రాంతమైన అంతర్వేది బీచ్‌ను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛత కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగితే గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా మారడంతో పాటు పర్యాటక ప్రాంతాలకు మరింత ఆకర్షణ పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. స్వచ్ఛత అనేది ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News