Shorts Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని హర్యానా రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి అరవింద్ కుమార్ శర్మ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి సూపరింటెండెంట్ రమేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు