Kaizer News

కొడంగ‌ల్‌కు భారీగా తరలిన టీఆర్ఎస్‌ శ్రేణులు

కొడంగ‌ల్‌కు భారీగా తరలిన టీఆర్ఎస్‌ శ్రేణులు

· State - Telangana · prabhanews.com

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘చలో కొడంగల్’ పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేసేందుకు ఆదివారం మ‌ధ్యాహ్నం సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కలబ్‌గూర్ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వాహనాలతో కొడంగల్‌కు బయలుదేరారు. పాంచజన్య సిద్ధాంతాల స్ఫూర్తితో తెలంగాణ ప్రజల హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ద‌యాక‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లినట్లు తెలిపారు

Original source: prabhanews.com
Read more on Kaizer News