Kaizer News

Religious Harmony | వెల్లివిరిసిన మతసామరస్యం.. వేల

Religious Harmony | వెల్లివిరిసిన మతసామరస్యం.. వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు

· State - Telangana · ntnews.com

అమరావతి : ఏపీలో గణేష్‌ నవరాత్రులు ( Ganesh Festivals) ఉత్సహంగా కొనసాగుతున్నాయి. వాడవాడన వెలసిన వినాయక విగ్రహాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి రోజు పూజలు నిర్వహిస్తున్నారు. చిన్న విగ్రహాల నుంచి భారీ విగ్రహాల వరకు గణేషున్ని ప్రతిష్టించిన మండపాలను అందంగా అలంకరించారు. కొంత మంది మూడు రోజులకు మరికొంత మంది 5, ఇంకొంత మంది 9 రోజులకు వినాయకున్ని నిమజ్జనం చేస్తున్నారు. ఈ సందర్భంగా వినాయక మండపాల వద్ద నిర్వహిస్తున్న లడ్డూ వేలంపాట కార్యక్రమాలు ఉల్లాసంగా నిర్వహిస్తున్నారు. శ్రీసత్యసాయి ( Satyasai District ) జిల్లా ధర్మవరం పట్టణంలోని పార్థసారథి నగర్ సమీపంలో వినాయకుడి విగ్రహం వద్ద ఉంచిన లడ్డూ ప్రసాదాన్ని ముస్లిం దంపతులు ( Muslim couple ) చాందిని, మస్తాన్ వలి వేలంపాటలో దక్కించుకున్నారు. వినాయకుడి వద్ద నిర్వహించిన వేలంపాటలో రూ.1,45,000లకు లడ్డూను దక్కించుకుని మత సామరస్యాన్ని చాటుకుని ప్రశంసలు అందుకున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News