జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో సర్ నోటీసులు ప్రక్రియ సాగుతోంది. ఇటీవల ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో 7,03,691 ఓట్లు ఉన్నాయి. వీరిలో 1,34,392 ఓటర్ల పేర్లలో అక్షర దోషాలు, ఇతర పొరపాట్లు ఉన్నాయి. 29,498 మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదు. దీంతో 1,63,890 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఓటర్ల నోటీసులు జనరేట్ చేసినా వారికి అందించడంలో కాస్తా ఆలస్యమే అవుతోంది. ఇప్పటివరకూ 14 వేల మందికి బీఎల్వోలు నోటీసులు అందించారు. ఇంకా 1.50 లక్షల మందికి నోటీసులు అందించాల్సి ఉంది. నోటీసుల్లో పేర్కొన్న తేదీల్లో ఓటర్లు హియరింగ్ హాజరై తమ వద్ద ఉన్న ఆధారాలు చూపించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఫైనల్ ఓటర్ లిస్ట్లో పేరు తొలగిస్తారు