టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి తమ తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సోషల్‌మీడియాలో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) సెషన్‌లో ఆసక్తికర విషయాలాన్ని వెల్లడించారు. ఇప్పటికే 11 కిలోలు పెరిగాను ‘కొత్తగా తల్లులు కాబోతున్నవారూ.. ఎలా సాగుతోంది?’ అని ఓ అభిమాని సమంతను ప్రశ్నించారు. దీనికి ఓ అభిమాని ‘బరువు పెరుగుతోంది’ అని బదులిచ్చారు. దానికి స్పందించిన సమంత.. ‘నాకూ అదే అనిపిస్తోంది. ఇప్పటికే 11 కిలోలు పెరిగాను’ అంటూ చెప్పుకొచ్చారు. ‘ఈ మాతృత్వ దశను ఎంజాయ్ చేస్తున్నారా?’ అని మరో అభిమాని అడగగా.. ‘మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను’ అని సమంత బదులిచ్చారు. మరొకరు పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెడతారు? అని అడగగా.. దానికి మీ అందరి సహాయం కావాలి అని బదులిచ్చింది. రాజ్‌తో కలిసి బేబీమూన్ ఇటీవల సమంత భర్త రాజ్ నిడిమోరుతో కలిసి బేబీమూన్‌కు వెళ్లిన ఫొటోలను కూడా సోషల్‌మీడియాలో పంచుకున్నారు. కొత్త ప్రదేశాన్ని సందర్శిస్తూ ఇద్దరూ కలిసి గడిపిన క్షణాలు ఆ ఫొటోల్లో కనిపించాయి. అంతేకాకుండా తన వర్కౌట్ సెషన్స్‌కు సంబంధించిన కొన్ని గ్లింప్స్‌ను కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు. ‘మా ఇంటి బంగారం’ తర్వాత బ్రేక్ సమంత చివరిగా ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో కథానాయికగా కనిపించారు. ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం సమంత మాతృత్వం కోసం విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కంగనా నోట అన్నయ్య..! రాఖీతో ముగిసిన మాటల యుద్ధం హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) యువతకు తోడుగా నేనుంటా..! కూటమిపై రాచమల్లు అల్లుడు ఫైర్ గురు శిష్యుల చీకటి ఒప్పందంతో రాయలసీమ తాకట్టు.. శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు