Shorts Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండల్లా తలపిస్తున్నాయి. సాత్నాల మండలంలో గతరాత్రి కురిసిన భారీ వర్షాలతో సాత్నాల ప్రాజెక్టు వరద నీటితో నిండిపోయింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం ప్రాజెక్టు గేట్ల పైనుంచి వరద నీరు కిందికి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉంది. దీంతో పరివాహక గ్రామ ప్రజలు ఉండాలని, దీంతోపాటు ఏ క్షణంలోనైనా అదిలాబాద్ నుండి చంద్రపూర్ వైపు వెళ్లే తరుణం వాగు లో లెవెల్ వంతెన పైనుండి వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు అధికారులు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’