Kaizer News

KTR | రేవంత్‌ ఆ డైలాగ్‌ను దించేశాడు.. నిజంగానే పాల

KTR | రేవంత్‌ ఆ డైలాగ్‌ను దించేశాడు.. నిజంగానే పాలమూరు రైతులను తొక్కుతున్నడు : కేటీఆర్

· State - Telangana · ntnews.com

KTR | నీ సొంతూరు కొండారెడ్డి పల్లి రైతులు శ్రీశైలం హైవే ఎక్కి కరెంట్ రావడం లేదని ధర్నా చేస్తున్నరు.. కనబడుతలేదా..? రేవంత్‌ నీకు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆయన శనివారం నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పరామర్శించి తిరుగు ప్రయాణంలో వనపర్తి జిల్లా పెబ్బేరుకు చేరుకున్నారు. రైతులు సాగు నీరు, కరెంట్‌ కోతలతో సతమతమవుతున్న నేపథ్యంలో పెబ్బే రు మండలం గుమ్మడం క్రాస్‌ రోడ్డు వద్ద రైతులతో మాట్లాడారు. గుమ్మడం గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన కేటీఆర్ సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్స్‌ను పరిశీలించారు. విద్యుత్ కోతల గురించి స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సొంత గ్రామ రైతులు రోడ్డెక్కుతున్నరంటే సిగ్గు లేదా..? ఆ డిప్యూటీ సీఎం ఉన్నడు.. ఎల్‌నినోతోని కరెంట్ వస్తలేదని ఆయన అంటడు. ఎల్‌నినోతో కరెంట్ కాదు.. ఎల్‌నినోతో నీళ్లు కాదు.. దేవుడు నీళ్లిచ్చిండు.. బొగ్గు ఇచ్చిండు.. దేవుడు బ్రహ్మాండంగా అన్ని ఇచ్చిండు. దేవుడు మన కేసీఆర్‌ను కూడా ఇచ్చిండు. కేసీఆర్‌ కరెంట్‌ తెచ్చి సబ్‌స్టేషన్లు కట్టిండు. బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చిండు. కానీ దురదృష్ణమేంటంటే దేవుడు అన్ని ఇచ్చినా మరి పూజారి కరుణించలేదన్నట్టు ముఖ్యమంత్రిగా కూర్చున్నోడికి తెలివిలేక, కరెంట్ ఇచ్చే తెలివి లేక ఇయ్యాళ్ల రైతులను అవస్తలు పెడుతున్నడని ఫైర్ అయ్యారు. యూరియా ఇచ్చే తెలివిలేదు.. రైతు బంధు ఇచ్చే తెలివిలేదు.. రుణమాఫీ ఇచ్చే తెలివిలేదు.. బోనస్ ఇచ్చే తెలివి లేదు.. ఆఖరికి నీళ్లు ఇచ్చే తెలివి కూడా లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేసి కేసీఆర్ మీకు అప్పజెప్పి పోయారు. ఏనుగు వెళ్లింది తోక చిక్కిందన్నట్టు 10 శాతం పని మిగిలి ఉంది. ఓ 4-5 మీటర్ల కాలువ తవ్వితే అక్కడి దాకా కొడంగల్‌ దాకా నీళ్లు పోతయ్‌. కానీ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు.. జల్దీజల్దీ చేస్తే కేసీఆర్‌కు పేరొస్తది కదా..అది రానియ్యా అని రేవంత్‌ ఫిక్సయ్యాడని కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ నార్లాపూర్‌ దగ్గర ఒక పంప్‌ ఆన్‌ చేసి పోయిండు. మరి కేసీఆర్ చేసిన పనే అని రైతులకు తెలుస్తది.. తప్ప నాకు పేరు రాదు అని చెప్పి.. రేవంత్‌ రెడ్డి ఎప్పుడూ తొక్కుకుంటూ వచ్చిన.. పండబెట్టిన అని డైలాగ్ చెబుతుంటడు. నిజంగానే ఇయ్యాళ్ల పాలమూరు వ్యవసాయాన్ని పండబెట్టిండు. పాలమూరు రైతులను తొక్కుతున్నడు. నీళ్లు ఇయ్యకుండా మీ బతుకులు ఆగం చేస్తా ఉన్నడని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తయింది పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని రేవంత్ రెడ్డి కావాలనే ఆ 10% పూర్తి చేయడం లేదు రేవంత్ రెడ్డి పాలమూరు పంటలను పండబెట్టిండు.. పాలమూరు రైతులను తొక్కుతున్నారు – కేటీఆర్ https://t.co/rdVCgRzEG7 pic.twitter.com/TKCJVr1LVz రేవంత్ రెడ్డి సొంత గ్రామ రైతులు కరెంటు రావడం లేదని రోడ్డు ఎక్కుతున్నారు డిప్యూటీ సీఎం ఎల్ నినోతో కరెంటు రావడం లేదని అంటున్నాడు ఎల్ నినో వల్ల కాదు.. ముఖ్యమంత్రిగా ఉన్నవాడికి తెలివిలేక కరెంటు ఇవడం లేదు – కేటీఆర్ https://t.co/HrVfveEyyb pic.twitter.com/fyK9GWNfcI

Original source: ntnews.com
Read more on Kaizer News